xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
జాతీయం

నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు

27-11-2026 15:13
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
xPress24, Delhi, November 27, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న పునఃప్రారంభించాలని ప్రతిపాదించినట్లు X వేదికగా వెల్లడించారు.   సభా వ్యవహారాల అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ 3 న ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉందని కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో...18వ లోక్‌సభ ఎనిమిదో సమావేశాల్లోని రెండో భాగాన్ని నవంబర్ 30 ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని స్పీకర్ ఆదేశించినట్లు లోక్‌సభ బులెటిన్ విడుదల చేసింది. రాజ్యసభ 271వ సమావేశాలను డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు పునఃప్రారంభిస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. అయితే ఈ నాలుగు రోజుల సమావేశాల్లో  ప్రశ్నోత్తరాల సమయం , జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఉండవని రెండు బులెటిన్లు స్పష్టం చేశాయి. ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది తప్ప ప్రోరోగ్ చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రత్యేక సమావేశాలకు మూడు రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సభ ప్రోరోగ్ కానందున లోక్‌సభ నిబంధన 15, రాజ్యసభ నిబంధనల ప్రకారం కొత్తగా సమావేశాలకు పిలవాల్సిన అవసరం లేకుండానే స్పీకర్ లేదా చైర్మన్ సభలను ఎప్పుడైనా నడపవచ్చు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.