xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

19-11-2026 09:48
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 500.38 పాయింట్ల భారీ నష్టంతో 82,031 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.45 పాయింట్లు పతనమై 25,277.95 వద్ద ముగిసింది.
xPress24, mumbai, November 18, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచే బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు, రోజంతా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 500.38 పాయింట్ల భారీ నష్టంతో 82,031 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.45 పాయింట్లు పతనమై 25,277.95 వద్ద ముగిసింది. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే కదలాడటంతో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది. టైటాన్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌, ఇండిగో షేర్లు నష్టపోగా.. ఎస్‌బీఐ, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 92 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3773 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 93.45గా ఉంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.