xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

నషాముక్త్ భారత్ కార్యక్రమం.. రెండోరోజు కొనసాగనున్న పాదయాత్ర

26-11-2026 14:25
నషాముక్త్ భారత్ కార్యక్రమం.. రెండోరోజు  కొనసాగనున్న పాదయాత్ర
నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు రెండోరోజు పాదయాత్ర కొనసాగనుంది. ముషీరాబాద్ నుంచి ప్రారంభమై అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వరకు యాత్ర సాగనుంది.
xPress24, Hyderabad, November 26, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల నషా ముక్త్‌ భారత్‌ - హైదరాబాద్‌ వాక్స్‌  పాదయాత్ర నేడు రెండో రోజు కొనసాగనుంది.  ముషీరాబాద్ నుంచి యాత్ర ప్రారంభమై అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద ముగియనుంది. మాదకద్రవ్యాల వినియోగంపై యువత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న అంబర్‌పేట నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర... రేపు జూబ్లీహిల్స్ వరకు మొత్తం 30 కిలోమీటర్లు కొనసాగనుంది. తొలి రోజు ముషీరాబాద్‌ వద్ద ముగిసిన యాత్ర.. ఇవాళ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా ప్రధాన ప్రాంతాలు, కూడళ్ల మీదుగా ముందుకు సాగుతూ అమీర్ పేట సత్యం థియేటర్‌ వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్రలో విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా, తొలిరోజు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని ముషీరాబాద్‌లో బస చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రెండో రోజు తన దినచర్యను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు. తెల్లవారుజామున  5 గంటలకే నిద్రలేచిన ఆయన, ఉదయాన్నే యోగాసనాలు వేసి శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందారు. ​యోగా తనకు ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఆయన సందేశమిచ్చారు. యోగాసనాల అనంతరం, రెండో రోజు పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాలకు ఆయన సిద్ధం కానున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.