తెలంగాణ
పీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
31-10-2026 12:51
24వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కావడంతో సూర్యాపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా వచ్చే ఈ డబ్బులు ఎరువులు, పురుగుమందులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారు.
xPress24, SURYAPET, October 31,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 వేల రూపాయల చొప్పున, సంవత్సరంలో మూడుసార్లు 2 వేల చొప్పున ఖాతాల్లో జమ కావడం పట్ల రైతులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1,00,217 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 24వ విడత నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో జిల్లాలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల వినియోగానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో పంట పెట్టుబడులకు ఈ డబ్బులు ఎంతో అండగా నిలుస్తున్నాయన్నారు. రైతుల అవసరాలను గుర్తించిన ప్రధానమంత్రి వారి అవసరాలకు అనుగుణంగా పథకాన్ని కొనసాగిస్తూ నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాగే రైతులకు అండగా నిలవాలని సూర్యాపేట జిల్లా రైతులు కోరుతున్నారు.
బైట్స్: 1. సంజీవరెడ్డి, రైతు
2. తీగల భీష్మారెడ్డి, రైతు