xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
తెలంగాణ

పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల

06-11-2026 15:20
తెలంగాణలో పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్‌పై నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో బంజారాహిల్స్‌లో మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటనలో మయోనైజ్ వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు తేలడంతో తొలుత ఏడాది నిషేధం విధించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆ నిషేధాన్ని మరో ఏడాది పాటు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
xPress24, Hyderabad, November 6, తెలంగాణలో పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపార కేంద్రాల్లో (స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు) పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్‌ను తయారు చేయడం లేదా ఆహార పదార్థాలతో పాటు వడ్డించడం చట్టవిరుద్ధమని గెజిట్‌లో స్పష్టం చేసింది. గత విషాద ఘటన నేపథ్యంలో నిర్ణయం గతంలో హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో వీధి వ్యాపారుల వద్ద మోమోస్ తిని ఒక మహిళ మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో.. మోమోస్‌తో పాటు అందించిన పచ్చిగుడ్ల మయోనైజ్‌లోనే ప్రమాదకర బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.