xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
సినిమా

పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి

21-09-2026 12:00
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా, సెప్టెంబర్ 18: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, abcసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, హౌస్ మ్యాపింగ్‌కు సంబంధించిన వినతులు అధికంగా అందాయి. భూ, రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు మంత్రి సూచనలు చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.