xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి స్టార్ హోటళ్లలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు

26-10-2026 14:29
పుట్టపర్తి స్టార్ హోటళ్లలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పలు స్టార్ హోటళ్లలో ఆహార భద్రతాధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
xPress24, Puttaparthi, October 26, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పలు స్టార్ హోటళ్లలో ఆహార భద్రతాధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో నీమ్ ట్రీ హోటల్‌ కిచెన్‌ను తాత్కాలికంగా సీజ్‌ చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించి తొలగించినట్లు అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ఆహార భద్రత, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు ఆదేశాల మేరకు ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ షమీర్‌ బాషా నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. తొలుత ప్రశాంతి గ్రామంలోని సాయి ప్యాలెస్‌ ఇన్‌ హోటల్‌ను అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ చేసి, అక్కడి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం పుట్టపర్తిలోని హోటళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆహార భద్రతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సాయి మా, నీమ్‌ ట్రీ హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నీమ్‌ ట్రీ హోటల్‌ కిచెన్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తాత్కాలికంగా సీజ్‌ చేసినట్లు షమీర్‌ బాషా వెల్లడించారు. మరోసారి తనిఖీలు నిర్వహించి, నిబంధనల మేరకు ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే కిచెన్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం సాయి టవర్స్‌ హోటల్‌లోనూ అరుణ్‌బాబు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వంటగదిలో పరిశుభ్రత లోపించడంతో పాటు, కాలం చెల్లిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌ కిచెన్‌ను మూడు రోజులపాటు సీజ్‌ చేసినట్లు అసిస్టెంట్‌ ఫుడ్‌ కమిషనర్‌ షమీర్‌ బాషా తెలిపారు. అనంతరం తిరిగి తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రతా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కిచెన్‌ను తెరిచేందుకు అనుమతించినట్లు వెల్లడించారు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పుట్టపర్తికి దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, ఇలాంటి ప్రాంతంలో కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన వంటకాలతో ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ హోటళ్లలో తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు, స్టార్‌ హోటళ్లలోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగుచూడటంతో భక్తులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లలో ఆహారం తీసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తే ఆహార కల్తీని అరికట్టడంతో పాటు, ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని స్థానికులు సూచిస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.