xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణపుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు

23-11-2026 15:50
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేరళం ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ బోధనలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆచరణలో పెడుతూ అర్థవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. మరోవైపు, శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాబాకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు సత్యసాయి బాబా అందించిన సేవలను కొనియాడారు.
xPress24, Puttaparthi, November 23, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు సోమవారం  ఘనంగా ప్రారంభమయ్యాయి. జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్  పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేరళం ముఖ్యమంత్రి  మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్    బోధనలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆచరణలో పెడుతూ అర్థవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.  మరోవైపు, శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు బాబాకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు సత్యసాయి బాబా అందించిన సేవలను కొనియాడారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.