xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు ముసాయిదా జాబితా విడుదల

26-11-2026 14:25
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు ముసాయిదా జాబితా విడుదల
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. రెండు నియోజకవర్గాల్లో మొత్తం 11.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ముసాయిదాపై ఈనెల 10 దాకా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది.
xPress24, Hyderabad, November 26, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 11,89,191 మంది ఓటర్లున్నారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పరిధిలో పట్టభద్రుల నుంచి మొత్తం 5,99,419 దరఖాస్తులు రాగా 5,68,105 మందిని ముసాయిదా జాబితాలో చేర్చారు. 31,314 మందిని అనర్హులుగా తేల్చారు. అర్హులైన ఓటర్లలో 3,36,668 మంది పురుషులు, 2,31,433 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 809 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పరిధిలో 6,70,407 దరఖాస్తులు రాగా... ఇందులో 6,21,086 మందిని ఓటర్లుగా ముసాయిదాలో చేర్చారు. 49,321 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నియోజకవర్గ ఓటర్లలో 3,73,984 మంది పురుషులు, 2,47,095 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. 894  పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం https://ceotelangana.nic.in వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచింది. డిసెంబరు 10 వరకు ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఉంది. 30న ఫైనల్ లిస్ట్ డిసెంబర్ 11 నుంచి మళ్లీ పట్టభద్రుల ఓటరు నమోదుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 30న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. కొత్త ఓటు కోసం ఫారం- 18, ఓటరు తొలగింపునకు ఫారం- 7, ముసాయిదా జాబితాలోని పేర్లలో సవరణకు ఫారం- 8 ను ఉపయోగించాలని సీఈవో పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.