తెలంగాణ
పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లు - ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవాలని SCR సూచన
24-10-2026 09:44

పండుగ సీజన్లో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, విశాఖపట్నం, తిరుపతి, నరసాపూర్, కాకినాడ మార్గాల్లో నడిచే ఈ రైళ్లలో ఖాళీ బెర్తుల వివరాలను ఈనెల 22 నాటికి రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ సూచించారు.
xPress24, HYDERABAD, October 23,