xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
ఆంధ్రప్రదేశ్

పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు

13-11-2026 16:46
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది.
xPress24, Paderu, November 13, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి పాల్గొని, బాలురు, బాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. బాలుర విభాగంలో విజేతలు: ప్రథమ స్థానం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ద్వితీయ స్థానం: ఉమ్మడి విజయనగరం జిల్లా తృతీయ స్థానం: నెల్లూరు జిల్లా నాల్గవ స్థానం: చిత్తూరు జిల్లా బాలికల విభాగంలో విజేతలు: ప్రథమ స్థానం: ఉమ్మడి విజయనగరం జిల్లా ద్వితీయ స్థానం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానం: తూర్పుగోదావరి జిల్లా నాల్గవ స్థానం: అనంతపురం జిల్లా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ కలెక్టర్ అభినందించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.