xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
తెలంగాణ

పాదయాత్రకు సిద్ధమైన ఎంపీ ఈటల రాజేందర్

24-10-2026 11:50
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధమయ్యారు.
xPress24, Dammaiguda, October 24, డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, 27వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట పట్టింది. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, లీచేట్ నీరు, కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈటల రాజేందర్  స్పష్టం చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. లీచేట్ నీటితో చెరువులు కలుషితమవుతున్నాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని చెత్త నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. దుర్వాసన లేకుండా, లీచేట్ నీరు బయటకు రాకుండా చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశానని.. అయినా ఇప్పటివరకు ఆశించిన పరిష్కారం లభించలేదని సహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, అవసరమైతే ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని ప్రకటించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని..ఈ సమస్య పరిష్కారం కోసం ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని..బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు విక్రం రెడ్డి డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు సమస్యపై ప్రారంభం కానున్న ఈ పాదయాత్రలో ప్రజలంతా భాగస్వామిలు కావాలని కోరారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.