xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

21-11-2026 09:47
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి పది లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఎవరూ ఈ పథకం ప్రయోజనాన్ని కోల్పోకూడదని సూచించారు.
xPress24, Mahabubnager, November 21, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో పనిచేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి పది లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేయించుకోవాలని, ఎవరూ ఈ పథకం ప్రయోజనాన్ని కోల్పోకూడదని సూచించారు. Byte:1. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే 2. గోకులం రవి కుమార్ యాదవ్, మహబూబ్ నగర్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.