ఆంధ్రప్రదేశ్
పునరావృత ఫిర్యాదుల పరిష్కారానికి నూతన పీజీఆర్ఎస్ విధానం
11-11-2026 09:31

ప్రజల నుంచి పీజీఆర్ఎస్‌లో అందే ఫిర్యాదులను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు నూతన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
xPress24, Vizianagaram, November 10,
విజయనగరం, నవంబర్ 10: ప్రజల నుంచి పీజీఆర్ఎస్‌లో అందే ఫిర్యాదులను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు నూతన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం వివిధ శాఖల అధికారులతో నూతన పీజీఆర్ఎస్ విధానంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే సమస్యపై పదేపదే అందే పునరావృత ఫిర్యాదులను సాంకేతిక వ్యవస్థ ద్వారా స్వయంచాలకంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గతంలో తీసుకున్న చర్యలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇటువంటి ఫిర్యాదులకు స్వయంచాలకంగా సమాధానాలు రూపొందించే విధానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ విధానం ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడంతో పాటు, ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు అందకుండా నివారించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.