తెలంగాణ
‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమం
07-11-2026 12:44
దీపావళి అంటే బాంబుల మోత కాదని, దీపాల వెలుగుల పండుగ అని పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో ‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో కాలుష్య రహిత దీపావళిపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యంతో పాటు.. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
xPress24, Mancherial, November 7,
మంచిర్యాల జిల్లాలో ‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో కాలుష్య రహిత దీపావళిపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మట్టి దీపాలు చేతబూని పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ‘టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు’ అంటూ వినూత్నంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే బాంబుల మోత కాదని, నూనె దీపాల వెలుగుల పండుగ అని అన్నారు. బాణసంచా వల్ల వెలువడే శబ్ద, వాయు కాలుష్యం గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులతో పాటు మూగజీవాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుండె, నరాల సంబంధిత సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాణసంచాకు స్వచ్ఛందంగా దూరంగా ఉండి, మట్టి దీపాలతోనే పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
బైట్: గుండేటి యోగేశ్వర్, ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు
అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా ప్రజలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బాణసంచా దుకాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలని కోరారు.
బైట్: సత్యనారాయణ, అగ్నిమాపక శాఖ అధికారి, బెల్లంపల్లి