xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా కొక్కిలిగడ్డ ప్రభాకరరావు

21-11-2026 09:47
ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్‌ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు అధ్యక్షతన శుక్రవారం ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
xPress24, Ongole, November 20, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్‌ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు అధ్యక్షతన శుక్రవారం ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన మొత్తం 27 మంది సభ్యులతో కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక నిర్వహించారు. ఒంగోలు రూరల్‌ జడ్పీటీసీ సభ్యుడు కొక్కిలిగడ్డ ప్రభాకరరావు పేరును చైర్‌పర్సన్‌ పదవికి మద్దిపాడు జడ్పీటీసీ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు ప్రతిపాదించగా, టంగుటూరు జడ్పీటీసీ ఈదర ప్రభాకరరావు బలపరిచారు. ఈ పదవికి మరెవరూ నామినేషన్‌ ప్రతిపాదించకపోవడంతో కొక్కిలిగడ్డ ప్రభాకరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి దర్శి జడ్పీటీసీ సభ్యురాలు వరికూటి లక్ష్మీతాయారు పేరును సంతమాగులూరు జడ్పీటీసీ ఆలూరి శ్రీవల్లి ప్రతిపాదించగా, తాళ్లూరు జడ్పీటీసీ నాగలక్ష్మి బలపరిచారు. ఈ పదవికి కూడా మరెవరూ పోటీలో లేకపోవడంతో వరికూటి లక్ష్మీతాయారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం నూతన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో చిరంజీవి నూతన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యులందరికీ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తానని నూతన చైర్‌పర్సన్‌ కొక్కిలిగడ్డ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బి.ఎన్‌. విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.