ఆంధ్రప్రదేశ్
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
05-11-2026 12:16
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బల్లికురవ మండలంలోని వైదన, కొప్పెరపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
xPress24, Ongole, November 5,
ప్రకాశం జిల్లా, నవంబర్ 5: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బల్లికురవ మండలంలోని వైదన, కొప్పెరపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.