ఆంధ్రప్రదేశ్
ప్రగతి సమీక్షా కార్యక్రమం
26-11-2026 12:08

ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన జాతీయ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ప్రగతి సమీక్షా సమావేశంలో భాగంగా చేపట్టిన జాతీయ ప్రాజెక్టులు, పీఎం సేతు పథకం అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమం విధానంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం సేతు పథకం కింద దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ఆధునీకరణకు ఆమోదం లభించిందని. 200 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేయనున్నామని. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 83 ఐటీఐలను ఆధునిక క్లస్టర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని సాయి ప్రసాద్ వివరించారు.
xPress24, Amaravati, November 26,