తెలంగాణ
ప్రజా అవసరాల స్థలాలను అమ్మితే ఊరుకోం: హరీశ్ రావు
13-11-2026 12:55
ప్రజా అవసరాల కోసం కేటాయించిన కూకట్ పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, November 13,
ప్రజా అవసరాల కోసం కేటాయించిన కూకట్ పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ స్థలాన్ని హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ట్రక్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలతో హరీశ్ రావు మాట్లాడారు. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజా వసతుల కల్పనకు ఉపయోగపడే ఏకైక స్థలం ఇదేనని, అలాంటి భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన స్థలాలను కాపాడుకుంటామని హరీశ్ రావు తెలిపారు.
బైట్
హరీశ్ రావు, మాజీ మంత్రి