ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టుల భూసేకరణ, భూ కేటాయింపుల పురోగతిపై సంయుక్త కలెక్టర్ సేధుమాధవన్
18-11-2026 10:01

జిల్లాలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భూసేకరణ, భూ కేటాయింపుల పురోగతిపై సంయుక్త కలెక్టర్ సేధుమాధవన్ మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
xPress24, Vizianagaram, November 17,
విజయనగరం, నవంబర్ 17:
జిల్లాలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భూసేకరణ, భూ కేటాయింపుల పురోగతిపై సంయుక్త కలెక్టర్ సేధుమాధవన్ మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండు ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పెందుర్తి నుంచి బొడ్డవర వరకు చేపడుతున్న ఎన్‌హెచ్-516బీ రహదారి విస్తరణ పనులు, కొత్తవలస నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న రైల్వే నాలుగో లైన్ పనులకు సంబంధించి మండలాల వారీగా భూసేకరణ, భూ కేటాయింపుల స్థితిగతులను సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో సంయుక్త తనిఖీలు పూర్తి చేయడంతో పాటు, భూసేకరణకు సంబంధించిన అవార్డుల జారీ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.