జాతీయం
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం-మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
18-11-2026 10:01
మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు420 హామీలను ఇచ్చి దగా చేసిందని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పలు విమర్శలు చేశారు.
xPress24, WANAPARTHY-509103, November 17,
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న అప్రజస్వామ్య నిర్ణయాలను ఎందుకు గుర్తించడం లేదో చెప్పాలని
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు సంఘాలకు కాలపరిమితితో ప్రత్యేక అధికారుల పాలన ఏర్పాటు చేయకుండా.. నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలను సింగిల్ విండో చైర్మన్లుగా నియామకం చేయడం సీట్ చోరీ కాదా అని అన్నారు.
ఎన్నికలకు ముందు హైదరాబాద్ అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఉపన్యాసం, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. భారత శిక్షాస్మృతి ప్రకారం 420 అంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అని గుర్తు చేసిన ఆయన.. అమలుకానీ 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇంకా రెండు సంవత్సరాల పాలన మాత్రమే మిగిలి ఉందని..ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుచేయాలని హితవు పలికారు.
బైట్- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి