అంతర్జాతీయం
ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని తకైచిలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు
18-11-2026 15:50
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయె తకైచిల సంకల్పాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో క్వాడ్ దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ బిజినెస్ లీడర్స్ ఫోరమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం సూపర్ ఇంటెలిజెన్స్ యాక్సిలరేటర్ వేదికలను ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
xPress24, philippins, November 18,
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరిగిన క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయె తకైచిల సంకల్పాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వారు దృఢమైన నాయకులని కొనియాడారు.
అరుదైన ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ అభివృద్ధికి కొత్త వేదికలు
సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో క్వాడ్ దేశాలన్నీ కలిసికట్టుగా వేగంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా క్వాడ్ దేశాలు అడుగులు వేస్తున్నాయని తెలిపారు. నూతన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ ఏర్పాటుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి 'సూపర్ ఇంటెలిజెన్స్ యాక్సిలరేటర్' వంటి వేదికలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.