తెలంగాణ
ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం
10-11-2026 10:05

ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం - పిఎంజెవికె కింద తెలంగాణలో 664 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 41 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక స్పందిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఈ పథకం కింద 18 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 4 హాస్టళ్ల నిర్మాణానికి ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 3 జూనియర్ కళాశాలలు, 2 హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తయిందని, మరో 10 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కిషన్రెడ్డి తెలిపారు.
xPress24, Hyderabad, November 10,