అంతర్జాతీయం
ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాలున్నా భారత్ అభివృద్ధి వెనుకబడలేదు: రాజ్‌నాథ్ సింగ్
19-11-2026 09:49
ప్రపంచ వ్యాప్తంగా పలు సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ 7.8శాతం వృద్ధిరేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందని రక్షణ శాఖ మంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల పాలనలో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.
xPress24, JAPAN, November 18,
పశ్చిమాసియా సంక్షోభం, హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నా భారత ఆర్థిక వృద్ధి వేగం తగ్గలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో ప్రవాస భారతీయులతో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ 7.8 శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని గత 12.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి ఎలాంటి అవినీతి మరక అంటలేదన్నారు.
దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్రమంత్రి తెలిపారు. అక్టోబర్ నెలలో ఒక్క యూపీఐ ద్వారానే 31.53 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. దేశ విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రక్షణ రంగ ఎగుమతులు రూ.40 వేల కోట్లు, ఉత్పత్తి రూ.1.80 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. స్వదేశీ కావేరి ఇంజన్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
బైట్- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి