xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జాతీయం

ప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీ

21-11-2026 12:41
న్యూఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిల్లాలో నిర్వహించిన తొలి ‘షాంఘై సహకార సంస్థ నాగరికతల సంవాద వేదిక’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. షాంఘై సహకార సంస్థ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, సభ్య దేశాల మధ్య కేవలం భద్రత, వాణిజ్య, ఆర్థిక సహకారం మాత్రమే కాకుండా ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు, విజ్ఞాన మార్పిడి మరింత బలోపేతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.
xPress24, Delhi, November 21, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అశాంతిపై చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. భారత్ వేదికగా నాగరికతల అనుసంధానంపై చర్చించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని పురానా ఖిల్లాలో తొలి ‘షాంఘై సహకార సంస్థ నాగరికతల సంవాద వేదిక’ ప్రారంభోత్సవంలో మోదీ ప్రసంగించారు. మహాభారత కాలం నాటి చరిత్ర కలిగిన ఈ పురాతన కోట వేదికగా వేద మంత్రోచ్ఛారణలు, బౌద్ధ తత్వం, హనుమంతుడి ప్రయాణ ఘట్టాల ప్రదర్శనలు భారత ఘన సంస్కృతిని, మానవాళి ఐక్యతను చాటిచెప్పాయని తెలిపారు. ప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ అని స్పష్టం చేశారు. ఎస్‌సీఓ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. సభ్య దేశాల మధ్య భద్రత, ఆర్థిక సహకారంతో పాటు సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఒక కొత్త సంప్రదాయానికి పునాది వేస్తూ ఈ సదస్సును చరిత్రాత్మకం చేయాలని ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. బైట్: నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.