xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

22-10-2026 15:59
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి వైద్య సిబ్బందిని ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 22, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 22: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కునేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్య పరికరాల పనితీరు, సిబ్బంది హాజరు, రోగుల రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.