xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలుకృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలు
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి – జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి

18-11-2026 10:00
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి – జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, November 17, పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 17: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం పార్వతీపురంలో ఆశా నోడల్ అధికారులు, ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును ఆమె సమీక్షించారు. ఆర్‌సీహెచ్‌లో గర్భిణులు, శిశువుల వివరాల నమోదు, ఈ-ఆశా అప్లికేషన్‌లో మాతా, శిశు ఆరోగ్య సేవలకు సంబంధించిన నివేదికల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తల నెలవారీ హాజరు వివరాలను సకాలంలో సమర్పించాలని సూచించారు. గర్భిణుల పేర్లను నమోదు చేసిన వెంటనే అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించి, సంబంధిత వివరాలను ఎంసీపీ కార్డుల్లో నమోదు చేయాలన్నారు. అనీమియా ముక్త్ భారత్, పీఎంఎస్‌ఎంఏ, సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు, ఆరోగ్య పర్యవేక్షణ నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతోపాటు హెచ్‌పీవీ, ఎంఆర్ టీకా కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. న్యూమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులను ముందుగానే గుర్తించే లక్ష్యంతో చేపట్టిన శాన్స్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నవజాత శిశు వారోత్సవాలను నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కుష్టు వ్యాధి సర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఎన్‌సీడీ వార్షిక సర్వేకు సంబంధించి సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే స్క్రీనింగ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, 4-డీ లక్షణాలను గుర్తించాలని తెలిపారు. వైద్య సిబ్బంది విద్యార్థుల వసతి గృహాలను తరచూ సందర్శించి, వారి ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మలేరియా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రమాదకర గ్రామాల్లో లార్వా అన్వేషణ, 'మా ఊరికి మలేరియా వచ్చింది', డ్రైడే, ఫోకల్ స్ప్రేయింగ్, ఏఎల్‌ఓ తదితర కార్యక్రమాలను వివిధ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.