విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం
28-09-2026 17:04

ప్రభుత్వం విద్యా, వైద్యం రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో కూడా కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. వెల్టూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు, 10 కోట్ల రూపాయలతో నిర్మాంచనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.
xPress24, HYDERABAD, September 28,