xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
జాతీయం

పర్యావరణ కాలుష్యానికి పాశ్చాత్య దేశాల తీరే కారణం: పీయూష్ గోయల్

23-10-2026 15:05
బెర్లిన్ గ్లోబల్ డైలాగ్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యానికి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం ప్రకారం పేద దేశాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
xPress24, DELHI, October 23, పర్యావరణ కాలుష్యం, ఓజోన్ పొర క్షీణతకు పాశ్చాత్య దేశాల తీరే కారణమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ వేదికగా పశ్చిమ దేశాల వైఖరిని ఆయన వివరించారు. ఐరోపా, అమెరికా దేశాలే కాలుష్య తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన.. ఆ మూల్యాన్ని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించాల్సి రావడం సమంజసం కాదన్నారు. గణాంకాలతో వివరాలు వెల్లడి ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతం ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాల వాటా కేవలం 3 నుంచి 3.5 శాతం మాత్రమేనని పీయూష్ గోయల్ గుర్తుచేశారు. అదే సమయంలో ప్రపంచ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న ఐరోపా సమాజం.. దాదాపు 17 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతోందని గణాంకాలతో సహా స్పష్టం చేశారు. భారత్ తలసరి కర్బన ఉద్గారాలు ఐరోపా తలసరి ఉద్గారాలలో 10 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. హామీలు నెరవేర్చడంలో వైఫల్యం 2015 పారిస్ వాతావరణ సదస్సులో పేద దేశాలకు ఇస్తామన్న 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం హామీని 11 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి చెందిన దేశాలు నెరవేర్చకపోవడంపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందాల ప్రకారం రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని సూచించారు. బైట్ - పీయూష్ గోయెల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.