రాజకీయాలు
పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి
23-09-2026 05:30
పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘ది ఎర్త్ సెంటర్ – విష్టా స్పేసెస్’ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణహిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
xPress24, Bengaluru, September 21,