xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు

29-10-2026 14:14
అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి.
xPress24, Paravathipuram, October 29, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 29: అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఒడిశా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులతో పాటు వెంగళరాయసాగర్, గోముఖి రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా దిగువ ప్రాంతాల్లోని నదుల్లోకి నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల్లో నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావం, వరద పరిస్థితులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు, వరద ప్రవాహాల తీవ్రతను బట్టి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పాచిపెంటలో అత్యధిక వర్షపాతం జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం పాచిపెంట మండలంలో అత్యధికంగా 122.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సీతంపేటలో 85.8 మి.మీ., పాలకొండలో 82.5 మి.మీ., మక్కువలో 70.8 మి.మీ., సాలూరులో 65 మి.మీ., బలిజిపేటలో 46.8 మి.మీ., పార్వతీపురంలో 44.7 మి.మీ., వీరఘట్టంలో 41.8 మి.మీ., సీతానగరంలో 41.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే గరుగుబిల్లిలో 33.8 మి.మీ., భామినిలో 31.8 మి.మీ., కొమరాడలో 30.5 మి.మీ., జియ్యమ్మవలసలో 18.5 మి.మీ., కురుపాంలో 11.3 మి.మీ., గుమ్మలక్ష్మీపురంలో 8.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 735.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, సగటు వర్షపాతం 49.05 మిల్లీమీటర్లుగా నమోదైంది.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.