xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత వాతావరణంలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగింపు

20-11-2026 10:01
ప్రశాంత వాతావరణంలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగింపు
ప్రకాశం జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
xPress24, Ongole, November 19, ప్రకాశం జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. గురువారం అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దర్శి నియోజకవర్గ అదనపు నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో 198 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటికి సంబంధించి 61 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అదనపు నామినేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేయవని, పార్టీల మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, దీనికి అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులకు గురైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని, వారి సహకారంతో ప్రశాంతంగా నామినేషన్లు వేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గంలో కొన్ని చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.