ఆంధ్రప్రదేశ్
పలు చోట్ల రీపోలింగ్
06-11-2026 14:33

ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అనంతరపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో 8వ పోలింగ్ కేంద్రం, పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో 46 మరియు 47 వ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే కర్నూలు జిల్లా అర్లబండ గ్రామంలోని 2 వ పోలింగ్ కేంద్రంలో, శ్రీకాకుళం జిల్లాలోని పొన్నం గ్రామంలోని 2 వ పోలింగ్ కేంద్రంలో, పల్నాడు జిల్లా అండుగురు గ్రామంలోని 43 పోలింగ్ కేంద్రంలో, మార్కాపురం జిల్లా గంగవరం గ్రామంలోని 5 వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది.
xPress24, Amaravati, November 6,