ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి
05-11-2026 15:49
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి గురువారం సందర్శించి పరిశీలించారు.
xPress24, Palanadu, November 5,
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి గురువారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను, కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.