ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
26-11-2026 11:58

మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం (సి.ఎస్.పురం) మండలంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గురువారం ఉదయం పరిశీలించారు.
xPress24, MARAKAPUARAM, November 26,
మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం (సి.ఎస్.పురం) మండలంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గురువారం ఉదయం పరిశీలించారు.
సి.ఎస్.పురంలోని పి.ఎం.శ్రీ జెడ్పీ హైస్కూల్, కోవిలంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కంభంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్ణీత సమయపాలన పాటిస్తూ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ పూర్తి చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎన్నికల సిబ్బంది పరస్పర సమన్వయంతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.