xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తక్షణమే నిలిపివేయాలి.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ నేతలు వినతి

24-11-2026 11:22
నాగార్జునసాగర్ గర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలు కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరారు. ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకున్న ఏపీ మళ్లీ 9 టీఎంసీలు అడుగుతోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన, జలదోపిడీని ఎండగట్టేందుకు డిసెంబర్ 10న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
xPress24, Hyderabad, November 23, కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పల్నాడు వాటర్ గ్రిడ్' పేరుతో అక్రమ పనులు చేపట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌తో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశమై, ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం భేటీ వివరాలను జగదీశ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే తన వాటాకు మించి ఎక్కువ నీటిని వాడుకున్న ఆంధ్రప్రదేశ్, మళ్లీ అదనంగా 9 టీఎంసీల నీరు కావాలని అడుగుతోందని విమర్శించారు. ఎలాంటి అనుమతులు, ముందస్తు సమాచారం లేకుండా నాగార్జునసాగర్ గర్భంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను వెంటనే ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. డిసెంబర్ 10న నల్గొండలో భారీ బహిరంగ సభ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ అన్యాయం చేస్తోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు, ఏపీ చేస్తున్న జలదోపిడీని ప్రజల ముందు ఎండగట్టేందుకు డిసెంబర్ 10న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగదీశ్ రెడ్డి ప్రకటించారు. Bytes: జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.