xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

21-10-2026 09:31
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
విజయదశమి వేళ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బంధించి వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రైతులకు మేలు చేసే పాలపిట్టలను హింసించడం తగదని, బోనుల్లో బంధించినట్లు గుర్తిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1800-4255364 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
xPress24, hyderabad, October 20, విజయదశమి సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టలను బంధించి వ్యాపారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ హెచ్చరించారు. దసరా పండుగ అంటే ఆనందం, స్వేచ్ఛ, సమస్త మూగజీవులపై కరుణ చూపడమని ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. దసరా వేళ పాలపిట్టను చూడటం శుభసూచకమనే పేరుతో కొందరు వాటిని బోనుల్లో బంధించి అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారని, అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పాలపిట్ట పంటలను నాశనం చేసే పురుగులను తింటూ రైతులకు ఎంతో మేలు చేసే నేస్తమని పేర్కొన్నారు. అది వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సంస్కృతికి గౌరవమని వివరించారు. ఎవరైనా పాలపిట్టలను బంధించినట్లు తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1800-4255364 కు సమాచారం అందించి రక్షించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించి మూగజీవులను కాపాడాలని సీపీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బైట్ వి.సి. సజ్జనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.