xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
తెలంగాణ

పిల్లల మాటకు విలువ ఇద్దాం, అభిప్రాయాలను గౌరవిద్దాం: కలెక్టర్ హేమంత్

17-11-2026 10:28
ములుగు జిల్లా కలెక్టరేట్‌లో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పిల్లల ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని దరఖాస్తులను స్వీకరించారు.
xPress24, Mulugu, November 16, ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని పిల్లల ప్రజావాణి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ భాగస్వామ్యంతో 'నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్' నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించి ప్రజావాణి నిర్వహించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన, తగిన చర్యలు కలెక్టర్ హేమంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు అందించిన దరఖాస్తులను పరిశీలించి, జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ.. నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న బాలల వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు తమ ఇబ్బందులు, సూచనలను నేరుగా కలెక్టర్‌కు తెలియజేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. బైట్ - హేమంత్ బోర్కాడే సహదేవరావు ఐఏఎస్ (ములుగు జిల్లా కలెక్టర్) ప్రేమలత (ములుగు జిల్లా సంక్షేమ అధికారి)

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.