xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
ఆంధ్రప్రదేశ్

పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

02-11-2026 17:13
పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
xPress24, Polavaram, November 2, రంపచోడవరం, నవంబర్ 2: పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 12 జెడ్పీటీసీ స్థానాలను నోటిఫై చేయగా, అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీలో ఉండటంతో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 101 ఎంపీటీసీ స్థానాలను నోటిఫై చేయగా, ఏ ఒక్క స్థానంలోనూ ఏకగ్రీవ ఎన్నిక జరగలేదు. దీంతో మొత్తం 101 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల నుంచి 275 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 2,78,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,32,408 మంది పురుషులు, 1,46,121 మంది మహిళలు, 16 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. అధికారుల సమన్వయంతో ఎన్నికల ఏర్పాట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు చిట్టిపులి నరేంద్ర పడాల్, డి. పృథ్వీరాజ్ కుమార్, జెడ్పీ సీఈవో కె. పురుషోత్తం రావు, ఓఎస్డీ జావళి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్, డ్వామా పీడీ బి. రామ్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్, బ్యాలెట్ పెట్టెల తరలింపు, స్ట్రాంగ్ రూముల భద్రత, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విధుల పర్యవేక్షణతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.