ఆంధ్రప్రదేశ్
పోలవరం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
07-11-2026 10:01

పోలవరం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికలు–2026 ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.
xPress24, Polavaram, November 6,
రంపచోడవరం, నవంబర్ 6:
పోలవరం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికలు–2026 ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.
నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో, శుక్రవారం చింతూరులోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండలాలకు చెందిన కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రతి దశలోనూ పారదర్శకతను పాటిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.