xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
తెలంగాణ

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి

21-10-2026 17:23
హైదరాబాద్ గోషామహల్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచినట్లు ప్రకటించారు. 2028 నాటికి పోలీసు శాఖలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
xPress24, Hyderabad, October 21, హైదరాబాద్ గోషామహల్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, గౌరవ వందనం స్వీకరించారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం పెంచిందని వివరించారు. రాష్ట్ర పురోగతికి శాంతిభద్రతలే మూలస్తంభమని పేర్కొన్నారు. ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఎక్స్‌గ్రేషియా రూ.కోటికి పెంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లకు రూ.1.25 కోట్లు, డీఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పరిహారం పెంచామని గుర్తు చేశారు.  హోంగార్డులకు రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. పోలీసుల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2028 నాటికి ఖాళీల భర్తీ పోలీసు శాఖలో ఉన్న అన్ని ఖాళీలను 2028 నాటికి భర్తీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రికార్డు స్థాయిలో 112 మంది డీఎస్పీలను నేరుగా నియమించామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ సేవలను అభినందించారు. కల్తీ ఆహార నిరోధానికి 'టీజీ సేఫ్', మహిళలు, పిల్లల రక్షణ కోసం 'స్టాండ్ విత్ హర్', 'స్పందన' బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. బైట్ - ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.