ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: మంత్రి అచ్చెన్నాయుడు
21-10-2026 16:25

దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
xPress24, Srikakulam, October 21,
శ్రీకాకుళం, అక్టోబర్ 21:
దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో పోలీసు అమరవీరుల స్మారక స్తూపం చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు రక్షణ కల్పిస్తూ నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసుల సేవలను ఆయన అభినందించారు.