xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ

పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లే సమాజంలో శాంతి: నిజామాబాద్ సీపీ

29-10-2026 16:18
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాల వల్లే సమాజంలో శాంతి భద్రతలు నిలుస్తున్నాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.
xPress24, Nizamabad, October 29, నేడు ప్రజలంతా శాంతియుతంగా, సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నారంటే అందుకు పోలీస్ అమరవీరుల త్యాగఫలమేనని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉన్న వారితో పాటు సమాజంలో శాంతి భద్రతల కోసం పనిచేసే పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం ప్రస్తుత కాలంలో రక్తం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని కమీషనర్ వివరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరొకరికి జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వెల్లడించారు. బ్లడ్ గ్రూపులపై అవగాహన కల్పించాలి ఆపదలో ఉన్న వారికి బ్లడ్ గ్రూపు తెలియక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని సాయి చైతన్య తెలిపారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరారు. బైట్ - సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.