ఆంధ్రప్రదేశ్
పోలీసు భద్రత ఏర్పాట్లు
05-11-2026 10:03

ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ పోలీసు భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు తగినంత మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు.పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని డీజీపీ తెలిపారు.
xPress24, Amaravati, November 5,