ప్రాంతీయం
పులిరాముడుగూడెం పంచాయతీలో చరిత్ర సృష్టించిన కూటమి అభ్యర్థి!
09-11-2026 16:14

పులిరాముడుగూడెం పంచాయతీలో చరిత్ర సృష్టించిన కూటమి అభ్యర్థి! కొన్ని దశాబ్దాల ఆధిపత్యానికి తెర.. పులిరాముడుగూడెంలో కూటమి విజయకేతనం!
XPress24 Jangareddygudem 09-11-2026
కొన్ని దశాబ్దాలుగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీకి పట్టున్న పులిరాముడుగూడెం పంచాయతీలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గ్రామంలో వివిధ పార్టీలకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది.
ఈ ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్సీపీ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. సీపీఐ ఎంఎల్ పార్టీ విజయం సాధిస్తుందని భావించిన తరుణంలో కూటమి అభ్యర్థి మడకం పాపమ్మ గెలిపించి విజయం సాధించామని కూటమి నాయకులు అన్నారు.
ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా ఈసారి ఎన్నికల చైతన్యం పెరగడం విశేషం.
తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన మడకం పాపమ్మ, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు బి. సురేష్ఎం. ప్రసాద్, , టి. సూర్య తేజ, ఎం. రమేష్, ఎం. రాజేష్, టి. సూర్య చంద్రం, ఎం. వెంకటేశ్వరరావు, టి. నాగేశ్వరరావు, కె. రామకృష్ణ, మల్లేష్, కనకరావు మాట్లాడుతూ తమ విజయానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.