xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

21-10-2026 09:30
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోషిని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి, ఇన్వెస్ట్ సమ్మిట్ సన్నాహాలపై అధికారులతో సమీక్షించారు.
xPress24, hyderabad, October 20, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి  ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని సీఎం స్వయంగా ఆయన ఛాంబర్‌లోని కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కిల్ వర్సిటీ పనుల పరిశీలన.. ఇన్వెస్ట్ సమ్మిట్‌పై సమీక్ష కమిషనరేట్ ప్రారంభం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా సమీపంలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం త్వరలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ సమ్మిట్ ఏర్పాట్లపై కమిషనర్ శశాంక ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేలా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

🎥 వీడియో

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.