xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!

24-10-2026 12:59
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియు పిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించి.. ఈ టోర్నీ టైటిల్ రేసులో నిలిచిన ఏకైక భారత షట్లర్‌గా నిలిచింది.
xPress24, Hyderabad, October 24, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన చియు పిన్‌ను 21-13, 21-14 తేడాతో సింధు నేరుగా చిత్తు చేసింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. కేవలం 39 నిమిషాల్లోనే కేక్ వాక్‌లా మ్యాచ్‌ను ముగించి ఘనవిజయాన్ని అందుకని సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక శనివారం జరగబోయే ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరులో జపాన్ క్రీడాకారిణి హినా అకేచితో సింధు తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో టైటిల్ రేసులో నిలిచిన ఏకైక భారత షట్లర్ పీవీ సింధు కావడం విశేషం. సింధు సెమీస్‌లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని భారత క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.