xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
తెలంగాణ

బాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖ

06-11-2026 15:00
దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు హైదరాబాద్ అగ్నిమాపక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్దేశిత మైదానాల్లో గరిష్ఠంగా 100 దుకాణాలకే అనుమతి ఉంటుందని, షాపుల మధ్య 3 మీటర్ల దూరం ఉండాలని స్పష్టం చేసింది. నీటి బ్యారెళ్లు, ఇసుక బకెట్లను అందుబాటులో ఉంచాలని, నిబంధనలు పాటించకపోతే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించింది.
xPress24, Hyderabad, November 6, దీపావళి పండుగ సందర్భంగా ప్రమాదాల నివారణకు బాణాసంచా దుకాణదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆదేశించింది. నిబంధనలు పాటిస్తేనే విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. మైదానాల్లోనే అనుమతి.. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం నిర్దేశిత మైదానాలు, సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణకు ఒక ప్రాంతంలో గరిష్ఠంగా 100 దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల ఖాళీ స్థలాన్ని వదలడం తప్పనిసరి చేశారు. అనుమతికి మించి నిల్వ చేస్తే చర్యలు లైసెన్సులో పేర్కొన్న పరిమాణానికి మించి క్రాకర్స్ నిల్వ చేయకూడదని, అనధికార లేదా నాసిరకం టపాసులను విక్రయించడం నేరమని హెచ్చరించారు. దుకాణాల వద్ద 'నో స్మోకింగ్' బోర్డులను ఏర్పాటు చేయాలని, మంటలను ఆర్పేందుకు 200 లీటర్ల నీటి బ్యారెళ్లు, ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.