ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
26-11-2026 17:15

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తన సతీమణి భూమిక చంద్రలాలితో కలిసి గురువారం బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం, 26వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు.
xPress24, Bapatla, November 26,
బాపట్ల: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తన సతీమణి భూమిక చంద్రలాలితో కలిసి గురువారం బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం, 26వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతో పాటు స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.