xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
తెలంగాణ

బీసీ-ఏలోకి మార్చండి : సీఎం రేవంత్ రెడ్డి కి ముదిరాజ్‎ల విజ్ఞప్తి

23-10-2026 09:45
బీసీ-ఏలోకి మార్చండి :  సీఎం రేవంత్ రెడ్డి కి ముదిరాజ్‎ల విజ్ఞప్తి
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్ వర్గానికి సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
xPress24, Hyderabad, October 22, భూస్వాములు, జమిందార్లపై పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పండుగ సాయన్న ముదిరాజ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఇకపై ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. దొరలు ఆక్రమించిన భూములను పోరాటంతో సాధించి పేదలకు పంచిపెట్టిన చరిత్ర ఆయనదని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్యతో పాటు పండుగ సాయన్న విగ్రహాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా, సామాజికంగా తగిన అవకాశాలు కల్పించామని వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్ సోదరులు చేసిన సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, వారికి సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిగతా ముదిరాజ్ నేతలకు కూడా త్వరలోనే తగిన అవకాశాలు వస్తాయని వెల్లడించారు. కులగణనలో ముదిరాజ్‌ల డిమాండ్లు ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చాలని ఆ సామాజిక వర్గీయులు కోరుతున్నారని సీఎం గుర్తుచేశారు. తమ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బీసీ వర్గాలకు పూర్తి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని రెండింతలు పెంచి అందిస్తున్నామని వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.